బండి యాదగిరిని సత్కరించిన మల్లికార్జున్

IMG-20250830-WA00361.jpg

ఎల్.బి.నగర్,ఆగస్టు30(నేటి దర్శిని): తెలంగాణ ప్రభుత్వ అదనపు కార్యదర్శి బండి యాదగిరి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా యువజన నాయకులు చాట్లపల్లి మల్లికార్జున్, తీరాందాస్ యాదగిరి తదితరులు బండి యాదగిరిని శాలువతో ఘనంగా సత్కరించారు. బండి యాదగిరి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. బండి యాదగిరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాల నడుమ జీవించాలని కోరుకున్నారు.