ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణ30 మంది చిన్నారులతో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

30 మంది చిన్నారులతో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

📰 Generate e-Paper Clip

చిన్నారుల కళా ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన.. బహుమతులతో ప్రోత్సాహం

మేడిపల్లి, సెప్టెంబర్ 22 (నేటి దర్శిని): ఉప్పల్ జోన్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ సత్యనారాయణపురం కాలనీలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ అద్భుతమైన నృత్య ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయి అభినయ కూచిపూడి కళాక్షేత్రం గురువు సంధ్యారాణి శివలంక ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సుమారు 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. సంప్రదాయ కూచిపూడి నృత్యరీతిలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్యాంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనతో దేవాలయ ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. వారి ప్రతిభను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులను ప్రోత్సహిస్తూ బహుమతులు, మెమెంటోలు అందజేశారు. చిన్నారుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ వనంపల్లి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్కల ధీరజ్ రెడ్డి, కోశాధికారి లెంకల రమణ రెడ్డి, కాలనీ అధ్యక్షులు జంగారెడ్డి, కార్యదర్శి భాస్కర్, కోశాధికారి ముత్యం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మోహన్ కుమార్, చంద్రసేన రెడ్డి, గుండు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular