ePaper
Sunday, November 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఫ్లెక్స్‌లో ప్రోటోకాల్ పాటించలేదా..?

ఫ్లెక్స్‌లో ప్రోటోకాల్ పాటించలేదా..?

📰 Generate e-Paper Clip

మంత్రి పర్యటన ఫ్లెక్స్‌లో ప్రోటోకాల్‌పై చర్చ.. ఇతర ప్రజాప్రతినిధుల పేర్లు, ఫొటోలు లేకపోవడంపై విమర్శలు

పటాన్‌చెరు, నవంబర్ 8 (నేటి దర్శిని): పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో నిర్వహించనున్న ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్స్‌లో ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉన్నాయా లేదా అనే అంశంపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రోటోకాల్ నిబంధనలను పాటించకుండా ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి సారించ లేనట్టుగా కనిపిస్తుంది. ముఖ్య డయాస్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హేమా హేమీల ఫోటోలు ముందు వరుసలు కాకుండా మరో నాయకుడి ఫోటో ఏర్పాటు చేయడంపై తీవ్ర చర్చకు దారి తీసింది. ఫ్లెక్స్ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు గుర్తొచ్చినట్టు కనబడడం స్పష్టమవుతుంది.

RELATED ARTICLES

Most Popular