మేడ్చల్, సెప్టెంబరు26 (నేటి దర్శిని): మేడ్చల్ జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ), టీజీవో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్‌ను టీజీవో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్‌తో పాటు రవీందర్, సీతారాం, నవీన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

