30 మంది చిన్నారులతో ఘనంగా కూచిపూడి నృత్య ప్రదర్శన
చిన్నారుల కళా ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన.. బహుమతులతో ప్రోత్సాహం మేడిపల్లి, సెప్టెంబర్ 22 (నేటి దర్శిని): ఉప్పల్ జోన్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ సత్యనారాయణపురం కాలనీలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ అద్భుతమైన నృత్య ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయి అభినయ కూచిపూడి కళాక్షేత్రం గురువు సంధ్యారాణి శివలంక ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సుమారు 30 మంది...