ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణవల్లంపల్లి రోడ్డు వినాయక దేవాలయం గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం

వల్లంపల్లి రోడ్డు వినాయక దేవాలయం గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

🔸 భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున శిల్పికి అడ్వాన్స్ చెక్కు

🔸 11,000 రూపాయల అడ్వాన్స్ చెక్కు అందజేత

🔸 శిల్పి శ్రీకాంత్ రాజ్ ప్రతిభకు ఫౌండేషన్ సభ్యుల ప్రశంసలు

🔸 డాక్టర్ కాకర్ల భీమయ్య కోరిక మేరకు దేవాలయ గర్భగుడి నిర్మాణనికి భీష్మారాజ్ ఫౌండేషన్ సహకారం

శిల్పి శ్రీకాంత్ రాజ్ తో భీష్మరాజ్ ఫౌండేషన్ ఛైర్మన్ డా.రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట, అక్టోబరు19(నేటి దర్శిని):నారాయణపేట జిల్లా వల్లంపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న వినాయక దేవాలయం అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ డా.రాజ్ కుమార్ రెడ్డి, దేవాలయం గర్భగుడి నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన శిల్పి శ్రీకాంత్ రాజ్‌కు రూ.11,000 రూపాయల అడ్వాన్స్ చెక్కు అందజేశారు.

ఈ సందర్భంగా భీష్మరాజ్ ఫౌండేషన్ ఛైర్మన్ డా.రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “వల్లంపల్లి గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభిరుచి ఎంతో ప్రశంసనీయం. గర్భగుడి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించి, నాణ్యతతో కూడిన శిల్పకళను ప్రతిబింబించే విధంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. తదుపరి దశలో కమిటీ సమక్షంలో మరిన్ని నిధులు విడుదల చేస్తాము” అని తెలిపారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శిల్పి శ్రీకాంత్ రాజ్‌ను ఘనంగా సన్మానించి ఆయన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఆయన ఈ దేవాలయం గర్భగుడి నిర్మాణాన్ని అత్యుత్తమ శిల్పరూపంలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నారాయణ ప్రజలు ఈ అభివృద్ధి కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ, భక్తుల సహకారంతో దేవాలయ నిర్మాణం మరింత వేగంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular