ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణభారత రాజ్యాంగ పితామహుడు కి 134వ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ పితామహుడు కి 134వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

హాలియా, ఏప్రిల్ 14 (నేటి దర్శిని):

హాలియా స్థానిక మున్సిపల్ కేంద్ర పరిధి మండల తాహసిల్దార్ కార్యాలయంలో ఈరోజు భారత రాజ్యాంగ పితామహుడు, నవభారత నిర్మాత, రాజకీయ తత్వవేత్త, ముసాయిధ కమిటీ చైర్మన్, అణగారిన వర్గాలకు  జాతిరత్నం మన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనుముల మండల తహసిల్దార్ వై .రఘు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి ల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి  పూలమాలు నివాళి అర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ కులం పునాదుల మీద నవ సమాజాన్ని నిర్మించలేమని అన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలు నేటి యువతీ యువకులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరాం (జూనియర్ అసిస్టెంట్), వెంకటేష్( జూనియర్ అసిస్టెంట్), మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి ఆంజనేయులు, మండల యువజన యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నకరికంటి సైదులు, పేర్ల బాలు, అనుముల వినయ్ కుమార్ మురళి బచ్చలి కూర, ఎడవల్లి సోమశేఖర్, జూపల్లి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular