HomeUncategorizedత్వాయా గుణమ్‌గరి తొలి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అల్పాహార పంపిణీ

త్వాయా గుణమ్‌గరి తొలి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అల్పాహార పంపిణీ

📰 Generate e-Paper Clip

ఎల్.బి.నగర్, మే 12(నేటి దర్శిని): అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన త్వాయా గుణమ్‌గరి తొలి పుట్టినరోజు సందర్భంగా కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో మురికివాడ ప్రాంతంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో పేదలు, నిరుపేదలకు అల్పాహారం అందజేసి చిన్నారి జన్మదినాన్ని సేవా దృక్పథంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు కపిల్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, త్వాయా గుణమ్‌గరిని దేవుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. చిన్నారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి కుష్ అగర్వాల్‌తో పాటు సభ్యులు సతీష్ యాదవ్, సంజయ్ ధనావత్, సునీల్ దరాడే మరియు ఆకాష్ ధవాలే పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular