ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
HomeUncategorizedబస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుల దాడి

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుల దాడి

📰 Generate e-Paper Clip

నల్గొండ, ఏప్రిల్ 26 (నేటి దర్శిని):
నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఆపలేదన్న కారణంతో డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కొందరు ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ బస్సును నిలిపివేయకుండా ముందుకు సాగడంతో, ఆగ్రహానికి గురైన ప్రయాణికులు బస్సు వెంట కొంత దూరం పరిగెత్తి చివరకు రోడ్డు పక్కకు ఆపించారు.
అనంతరం డ్రైవర్ రామ్‌కుమార్‌ను కిందికి దించి, తమ అత్యవసర పరిస్థితిని వివరించినట్లు సమాచారం. కొందరు ప్రయాణికులు ఆరోగ్య సమస్యల కారణంగా వెంటనే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో బస్సు ఆపకపోవడంపై డ్రైవర్‌ను ప్రశ్నించారు. అయితే డ్రైవర్ సమాధానం ప్రయాణికులను అసంతృప్తికి గురిచేసిందని, పరిస్థితి క్రమంగా ఉద్రిక్తతకు దారితీసిందని స్థానికులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఉన్న కొందరు ప్రయాణికులు డ్రైవర్‌పై దాడికి దిగారు.
ఈ ఘటన రద్దీగా ఉండే రోడ్డుపై జరగడంతో, బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular