బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుల దాడి

నల్గొండ, ఏప్రిల్ 26 (నేటి దర్శిని):నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఆపలేదన్న కారణంతో డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కొందరు ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ బస్సును నిలిపివేయకుండా ముందుకు సాగడంతో, ఆగ్రహానికి గురైన ప్రయాణికులు బస్సు వెంట కొంత దూరం పరిగెత్తి చివరకు రోడ్డు పక్కకు ఆపించారు.అనంతరం డ్రైవర్ రామ్‌కుమార్‌ను కిందికి దించి, తమ అత్యవసర పరిస్థితిని వివరించినట్లు...