కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
250 మందికి పైగా అనాథ, నిరుపేద చిన్నారులకు పరిశుభ్రమైన అల్పాహారం
ఎల్.బి.నగర్, జూలై 6 (నేటి దర్శిని): కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం కుమారి జశ్విత జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ అనాథ పిల్లల పాఠశాలలో అల్పాహార సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 250 మందికి పైగా అనాథ, నిరుపేద చిన్నారులకు పరిశుభ్రమైన, రుచికరమైన అల్పాహారాన్ని అందించి వారి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కృష్ణ గోపాల్ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ కపిల్ కుమార్ అగర్వాల్, సమితి సభ్యులతో కలిసి కుమారి జశ్వితతో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విద్యాభివృద్ధి, జీవితంలో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభ సందర్భాలను సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే దాతలు, సేవాభావం కలిగిన వారు కృష్ణ గోపాల్ సేవా సమితిని 8106876999 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.





