ePaper
Sunday, July 19, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణనేటి దర్శిని కథనానికి స్పందించిన అధికారులు..

నేటి దర్శిని కథనానికి స్పందించిన అధికారులు..

📰 Generate e-Paper Clip

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణ

గుర్రంపోడు, జూలై 14 (నేటి దర్శిని): గుర్రంపోడు మండలంలోని జూనుతుల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో లీకవుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌పై నేటి దర్శిని దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. పైప్‌లైన్ మరమ్మతులకు అడ్డంకిగా ఉన్న మట్టిబండను జేసీబీ సహాయంతో తొలగించి, దెబ్బతిన్న పైప్‌లైన్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా పైప్‌లైన్ లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన అనంతరం సంబంధిత శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకున్న అధికారులకు స్థానిక గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ పరిష్కారానికి దోహదపడుతున్న నేటి దర్శిని దినపత్రిక పాత్రను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular