ePaper
Monday, July 20, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణమాధవ నగర్‌లో కూచిపూడి నాట్య శిక్షణ ప్రారంభం

మాధవ నగర్‌లో కూచిపూడి నాట్య శిక్షణ ప్రారంభం

📰 Generate e-Paper Clip

  • మాధవ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థుల అభివృద్ధికి కూచిపూడి శిక్షణ శిబిరం
  • నర్తన కేలి ఆర్ట్స్ అకాడమీ వేసవి నాట్య తరగతులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 (నేటి దర్శిని):
చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నర్తన కేలి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుండగా, ప్రముఖ కూచిపూడి నాట్య శిక్షకురాలు నవ్య భారతి శిక్షణ అందిస్తున్నారు.వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా కాలనీలోని విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. పూర్వం భరతనాట్యం విస్తృతంగా ప్రాచుర్యంలో ఉండగా, ప్రస్తుత తరానికి కూచిపూడి వంటి సాంప్రదాయ కళలను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. నవ్య భారతి మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని, ఈ నెల 30వ తేదీ వరకు తరగతులు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్, పుష్పమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధులస, కమిటీ సభ్యులు సంయుక్త, హారతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular