బీసీల్లో ఉపకులాలకు సబ్ కోటా ఇవ్వాలి

c1f67b189ce8472b86d46ea7f11ec3d6.jpg

◻️     ఎన్నో కులాలకు రాజకీయ అవకాశాలు దక్కలేదు…

◻️     72 కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం…

◻️     కుల సంఘాల సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు…

హైదరాబాద్, జూలై16 (నేటి దర్శిని): బంజారాహిల్స్ లో కవిత  తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కుల సంఘాల ప్రతినిధులతో  బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీల్లో 25 వేల మంది ప్రజాప్రతినిధులు అయ్యేవరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. వారిలో సగంమంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందన్నారు.  అదేవిధంగా బీసీ లలో సర్పంచులు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్య మో, రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడమూ అంతే ముఖ్యమని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని, అది కేంద్రం పరిధిలో ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర గవర్నర్ కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

సబ్ కేటగిరీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే

గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదమున్నదని. ఆ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కవిత సూచించారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగిరీలు చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామని కవితి స్పష్టం చేశారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా వేధిస్తోందని, వెంటనే రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బొల్ల శివశంకర్, కోఆర్డినేటర్ ఆళ్లకుంట హరి, కో కన్వీనర్లు మారయ్య, కుమారస్వామి,  ప్రవీణ్, విజయేందర్, గోపు సదానంద్, రామకోటి ప్రజాపతి, రాచమల్ల బాలకృష్ణ, సల్వా చారి, మురళీకృష్ణ, గోరిగ నరసింహ, నారాయణ, కోల శీను, ఫారక్, లలిత యాదవ్, ప్రవీణ్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, సాయి, బీసీ విద్యార్థి సంఘం నేత చందు గౌడ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.


1 thought on “బీసీల్లో ఉపకులాలకు సబ్ కోటా ఇవ్వాలి

Comments are closed.