నేటి దర్శిని కథనానికి స్పందించిన అధికారులు..

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణ గుర్రంపోడు, జూలై 14 (నేటి దర్శిని): గుర్రంపోడు మండలంలోని జూనుతుల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో లీకవుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌పై నేటి దర్శిని దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. పైప్‌లైన్ మరమ్మతులకు అడ్డంకిగా ఉన్న మట్టిబండను జేసీబీ సహాయంతో తొలగించి, దెబ్బతిన్న పైప్‌లైన్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా పైప్‌లైన్ లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వెలుగులోకి...