ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఇబ్రహీంపట్నంలో గణేష్ నిమజ్జనానికి హాజరైన ఎమ్మెల్యే మల్ రెడ్ది రంగారెడ్డి

ఇబ్రహీంపట్నంలో గణేష్ నిమజ్జనానికి హాజరైన ఎమ్మెల్యే మల్ రెడ్ది రంగారెడ్డి

📰 Generate e-Paper Clip

తెలంగాణ పాటలతో హోరెత్తించిన మధుప్రియ

రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు

ఇబ్రహీంపట్నం,సెప్టెంబర్08 (నేటి దర్శిని): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాధుడి నిమజ్జనం సందర్భంగా జేఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఫోక్ సింగర్ మధుప్రియ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ జేఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి నిమజ్జన మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన అశేష భక్తజనానికి కృతజ్ఞతలు తెలిపారు. జేఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతియేడు వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో కూడా మరింత ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు, యువకులకు, మిగతా కళాకారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం గణనాథుడి చేతిలోని లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జేఆర్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, కళాకారులు, ఫోక్ సింగర్స్, వేల సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular