ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణరూ.73వేలకు గణేషుడి లడ్డును దక్కించుకున్న మల్లికార్జున్

రూ.73వేలకు గణేషుడి లడ్డును దక్కించుకున్న మల్లికార్జున్

📰 Generate e-Paper Clip

మల్లికార్జున్ ను సన్మానించిన నిర్వాహకులు

సంతోషం వ్యక్తం చేసిన మల్లికార్జున్

ఎల్.బి.నగర్, సెప్టెంబర్06 (నేటి దర్శిని):
యువజన భక్త సమాజం ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ గాంధీ బొమ్మ వద్ద సీనియర్ నాయకులు బోయిని మహేందర్ యాదవ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 62 ఏళ్లుగా గణనాథుడిని ప్రతిష్టించి విశేష పూజలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రుల పాటు విశేష పూజలు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం నిర్వహించిన లడ్డూ వేలంలో చాట్లపళ్లి మల్లికార్జున్ రూ.73వేలకు గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు. వేలం పాటలో గణనాథుడి లడ్డూను దక్కించుకున్న మల్లికార్జున్ ను నిర్వాహకులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బోయిని మహేందర్ యాదవ్, బోయిని శంకర్ యాదవ్, ఎడ్ల మహేందర్ గౌడ్, ఎండీ సలీం, కట్ట ప్రవీణ్, కాకి సాయినాథ్ గౌడ్, కాకి జయశంకర్ గౌడ్, ఆనంద్, భాస్కర్, భగవంత్ రాజ్, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular