అంబా భవాని దేవాలయ అభివృద్ధికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

IMG-20250706-WA0039.jpg

పలు దేవాలయాలను సందర్శించిన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట జూన్06 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని శ్రీ అంబా భవాని దేవాలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు జరిగాయి. బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్ కుమార్ రెడ్డిని దేవాలయ నిర్వాహకులు, భవసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబా భవాని దేవాలయం నిర్మాణ దశలో ఉందని, దేవాలయ నిర్మాణానికి తమవంతు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, సమాజ్ సభ్యులు నరేష్, నారాయణ, అంబరేష్, రాజ్ కుమార్, శశికళ, ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, వై.సంతోష్, మన్నె గోపాల్, ఎం.సంతోష్, శ్రీనివాస్, నాగురావు, భాస్కర్ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ నందీశ్వరస్వామి దేవాలయ సందర్శన

మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో ఉన్న శ్రీ నందీశ్వరస్వామి దేవాలయాన్ని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. దేవాలయం నిర్మాణంలో ఉందని, నిర్మాణానికి సహకరించాలని నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. అదే విధంగా గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, నాగిరెడ్డిపల్లి గ్రామంలోని పురాతన శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శివరాజస్వామి, మాజీ సర్పంచ్ జి.వీరారెడ్డి, శరత్, సాయప్ప, చంద్రప్ప, శ్రీశైలం, శివరాజ్, సునీల్ కుమార్, కైలాష్, సాయప్ప, శివకుమార్, మల్లికార్జున్, కృష్ణ, నారాయణపేట జిల్లా ధూప, దీప నైవేద్యం కమిటీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, నర్సింహాచారి, చంద్రమౌళి చారి, వేణుగోపాల్, మహేందర్ రెడ్డి, కృష్ణమూర్తి, మొగులప్ప, నారాయణ, రఘుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

1 thought on “అంబా భవాని దేవాలయ అభివృద్ధికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

Comments are closed.