ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఅనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్

అనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్

📰 Generate e-Paper Clip

‘పేట’లో బస్సును ప్రారంభించిన ఆర్టీసీ డీఎం లావణ్య

భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన డీఎం

సేవా రంగాల్లో ముందంజ: ఫౌండేషన్ సభ్యులు

నారాయణపేట జూన్28 (నేటి దర్శిని): సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను, సిబ్బందిని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో సంబంధిత అధికారులు తీర్థ యాత్రకు తీసుకెళ్లారు. తీర్థ యాత్రకు సంబంధించిన బస్సును శనివారం ఉదయం నారాయణపేట బారంబాయిలోని సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహం వద్ద భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపేటలో ఉన్న సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహకారంతో వారిని తీర్థ యాత్రకు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు.

సేవా కార్యక్రమాల్లో ముందంజ

అందరి మాదిరిగానే అనాథ విద్యార్థినులకు కూడా అన్ని ప్రదేశాలు, తీర్థ యాత్రలకు వెళ్లాలని ఉంటుందని, వసతి గృహం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి  చర్యలు చేపట్టి వారిని తీర్థ యాత్రకు పంపించడం జరిగిందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ ఫౌండేషన్ ముందుకు సాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీధర్, సురేష్, హన్మంతు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, శివరాజ్, సుదర్శన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, మిస్కిన్ సంతోష్, వెంకటరావు, వై.సంతోష్, అశోక్, నందుకుమార్, చామకూర నగేష్, కృష్ణ యాదవ్, మన్నె గోపాల్, శ్రీనివాస్, సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular