ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణవిద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించిన రాజ్ కుమార్ రెడ్డి

విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించిన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

ధన్వాడ జూన్26 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కంసాన్ పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై విద్యార్థినీ విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు తల్లిదండ్రులకు విద్యార్థినీ విద్యార్థులు పాదపూజ చేశారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

సమస్యలను ఏకరువు పెట్టిన పాఠశాల నిర్వాహకులు

పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయులు రాజ్ కుమార్ రెడ్డికి విన్నవించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను లిఖితపూర్వకంగా రాసి ఇస్తే వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని రాజ్ కుమార్ రెడ్డి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయురాళ్లు శ్వేత, రోజా, అధిక సంఖ్యలో గ్రామానికి చెందిన పెద్దలు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, నర్సింహనాయుడు, అశోక్, ఎం.సంతోష్, కృష్ణ యాదవ్, వై.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular