ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి: రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేటలో రక్తదాన శిబిరం
హాజరైన రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట,సెప్టెంబర్04 (నేటి దర్శిని):
ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట ఉర్దూ భవన్ లో హయత్ కేర్ ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాజ్ కుమార్ రెడ్డి హాజరై రక్తదానం చేసిన యువకులకు పండ్లు, జ్యూస్ ను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇలాంటి రక్తదాన శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతిఒక్కరూ విధిగా రక్తదానం చేసేలా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ మక్క ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ తాజ్, మోడ్రన్ స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ ఖదీర్, హెడ్ మాస్టర్ జకీర్ హుస్సేన్ తాజ్, హయత్ కేర్ ఫార్మసి డిగ్నటరీస్ డాక్టర్ రెహమతుల్లా, సయ్యద్ అహ్మద్, సయ్యద్ సోహైల్, ఫయాజ్ తాజ్, ఫయాజ్ ఖురేషీ, అబుదక్కర్, సిద్దిఖీ, ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సల్ల వెంకటేష్, వై.సంతోష్, రాజప్పగౌడ్, ఎం.సంతోష్ చామకూర నగేష్, బాలు నాయక్, చందు నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
