హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డులో బ్రిడ్జి నిర్మించాలి
హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డులో కొట్టుకుపోయిన వాగు ప్రాంతాన్ని సందర్శించిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం
నారాయణపేట,ఆగస్టు23 (నేటి దర్శిని):
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, భారీ వర్షాల కారణంగా ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయి చెట్టును పట్టుకొని ఆగిపోయారని కాలనీవాసులు వాపోయారు. నారాయణపేట జిల్లా హైదరాబాద్-నక్క రామయ్య కాలనీలో ఎగువ భాగాల నుండి వచ్చే నీరు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, తమను ఆదుకోవాలని కోరుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. అందుకు స్పందించిన రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులతో కలిసి నక్క రామయ్య కాలనీలో ఉన్న వాగు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వర్షాలు కురిస్తే ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాల్సి వస్తుందని ఆరోపించారు. నీటి ప్రవాహం కారణంగా జనజీవనం స్తంభించిపోతుందని తెలిపారు. ఈ విషయమై గతంలో స్థానిక మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వాగు ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సల్ల వెంకటేష్, వై.సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, జేకే అనిల్, ఎం.సంతోష్, కరాటే అశోక్, కాలనీవాసులు, మహిళలు ఉన్నారు.




4
4.5