ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణక్యాతన్ పల్లి వీరభద్రేశ్వరస్వామి దేవాలయంలో పూజలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

క్యాతన్ పల్లి వీరభద్రేశ్వరస్వామి దేవాలయంలో పూజలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బాపన్ పల్లి శివాలయంలో అన్నదానం

నారాయణపేట,ఆగస్టు23 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రావణమాస శాశ్వత రుద్రాభిషేకం-స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఉత్సవాలకు హాజరయ్యారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానాన్ని రాజ్ కుమార్ రెడ్డి ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నారాయణ, ఉపాధ్యక్షులు బసంత్ రాజ్ పటేల్, కోడ్లీ శరణప్ప, బసిరెడ్డి, మోహన్ రెడ్డి, గంగాధర్, పురోహితులు శివకుమార్, శరణయ్య, గణేష్, చెన్ను, ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, నర్సింహనాయుడు, ఎం‌.సంతోష్, వై.సంతోష్, నర్సింహ, విజయ్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

బాపన్ పల్లి శివాలయంలో…

బాపన్ పల్లి గ్రామంలోని భీమశంకర దేవాలయ ప్రాంగణంలో జరిగిన అన్నదానాన్ని రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు, గ్రామస్థులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular