ePaper
Sunday, July 19, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణవిట్లాపూర్ మాచాపూర్ గ్రామాల్లో పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు

విట్లాపూర్ మాచాపూర్ గ్రామాల్లో పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు

📰 Generate e-Paper Clip

చిన్నకోడూరు (నేటి దర్శిని వెబ్ డెస్క్): విట్లాపూర్, మాచాపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రవీందర్ రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని విట్లాపూర్ గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి అడుగుల ఆనవాళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లకుండా ఉండాలన్నారు. అలాగే పంట పొలాల చుట్టూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్‌తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular