ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణకొండారెడ్డిపల్లి చెరువు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాజ్ కుమార్ రెడ్డి

కొండారెడ్డిపల్లి చెరువు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి

నారాయణపేట,సెప్టెంబర్04 (నేటి దర్శిని): నవరాత్రులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు సంబంధిత అధికారులు కొండారెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కొండారెడ్డిపల్లి చెరువు ప్రాంతంలో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఫౌండేషన్ సభ్యులతో కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి వచ్చే గణేష్ మండపాల నిర్వాహకులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు తగిన ఏర్పాట్లను చేయాలని కోరారు. అనంతరం చెరువు పరిసర ప్రాంతాల్లో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్ కుమార్ రెడ్డి వెంట ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సల్ల వెంకటేష్, వై.సంతోష్, రాజప్పగౌడ్, ఎం.సంతోష్ చామకూర నగేష్, బాలు నాయక్, చందు నాయక్, మోహన్ నాయక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular