ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్‌ పోసి దహనం

పారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్‌ పోసి దహనం

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్, నేటి దర్శిని క్రైమ్ బ్యూరో: సూర్యుడు ఉదయించడానికి ముందే చీకటి తెరలను తొలగిస్తూ విధుల్లోకి కదిలిందా ఇల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ.. భర్త లేని ఆ ఇంట ఆమే సర్వస్వం. పిల్లల కడుపు నింపడానికి చెమటోడ్చి బతుకు బండి లాగుతున్న ఆ పేద మహిళపై కిరాతకులు కాూరంగా కట్టెअगर కాదు కదా, ఏకంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కళ్లల్లో కారం చల్లి, సజీవ దహనం చేయబోయిన ఈ అఘాయిత్యం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కలకలం రేపింది.

ఆదోనిలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన నరసమ్మ (30) మున్సిపాలిటీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలిగా జీవనం సాగిస్తోంది. ఐదేళ్ల క్రితం భర్త శ్రీనివాసులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లల బాధ్యత ఆమె భుజాన పడింది. రోజూ మాదిరిగానే ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా రోడ్డు ఊడ్చే పనుల్లో నిమగ్నమై ఉంది. సరిగ్గా అదే సమయంలో ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన ఇద్దరు మహిళలు సహా ముగ్గురు దుండగులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు.

ముందుగా నరసమ్మ కళ్లల్లో కారం చల్లారు. ఆమె తేరుకునే లోపే విలవిల్లాడిపోయేలా ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటల వేడికి తట్టుకోలేక ఆమె పెట్టిన ఆర్తనాదాలు ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. తోటి పారిశుధ్య కార్మికులు పరుగున వచ్చి, అక్కడే ఉన్న ఓ మహిళ తన చీరను ఆమె ఒంటికి చుట్టి మంటలనుార్పారు. అప్పటికే ఆమె శరీరం 80 శాతం కాలిపోయింది. హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

కక్షే కారణం..

ఈ దారుణానికి వ్యక్తిగత వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నరసమ్మతో సన్నిహితంగా ఉండే చిన్న ఈరన్న అనే వ్యక్తి ఈ ఏడాది జూలై 26న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి చిన్న ఈరన్న కుటుంబ సభ్యులకు, నరసమ్మకు మధ్య తీవ్ర విభేదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తన భర్త మృతికి నరసమ్మే కారణమంటూ కక్ష పెంచుకున్న చిన్న ఈరన్న భార్య శిరీష, మరో ఇద్దరు కలిసి ఈ అమానుషానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేసింది. ఆస్పత్రి మంచంపై మృత్యువుతో పోరాడుతూ కూడా “నా పిల్లలను కాపాడండి..” అంటూ ఆమె రోదిస్తున్న తీరు అక్కడి వైద్యులను, సిబ్బందిని కంటతడి పెట్టించింది. తీవ్రంగా గాయపడిన నరసమ్మ వాంగ్మూలాన్ని రెండవ అదనపు న్యాయాధికారి శ్రీవల్లి ఆస్పత్రికి స్వయంగా వెళ్లి రికార్డు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

RELATED ARTICLES

Most Popular