ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణచండీ యాగానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

చండీ యాగానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

👉     పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చక సంఘ ప్రతినిధులు, పురోహితులు

👉     పేటలో అర్చక సంఘ కార్యాలయ ఏర్పాటుకు 200 గజాల స్థలాన్ని కేటాయిస్తామన్న రాజ్ కుమార్ రెడ్డి

👉     హర్షధ్వానాలను వ్యక్తం చేసిన అర్చక సంఘ సభ్యులు, పురోహితులు

ఎల్.బీ.నగర్ జూలై16 (నేటి దర్శిని):
ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడలోని తూల్జాభవన్ లో బుధవారం నిర్వహించిన పంచకుండాత్మక చండీ, కుబేర పాశుపత యాగానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రాజ్ కుమార్ రెడ్డికి అర్చక సంఘం ప్రతినిధులు, పురోహితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువ, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన యాగానికి మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారితో కలిసి రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవచారి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ధూప, దీప నైవేద్య అర్చక సంఘ సమావేశానికి రాజ్ కుమార్ రెడ్డి లక్ష రూపాయలను అందజేయడం అభినందనీయమని అన్నారు.

పేటలో అర్చక సంఘ కార్యాలయానికి 200 గజాల స్థలం: రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట జిల్లాలో ధూప, దీప నైవేద్య అర్చక సంఘ కార్యాలయ ఏర్పాటు కోసం 200 గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా హర్షధ్వానాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే సంఘానికి లక్ష రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు. అర్చక సంఘానికి స్థలాన్ని ప్రకటించిన రాజ్ కుమార్ రెడ్డిని వేణుగోపాలాచారి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో అర్చక సంఘం ప్రతినిధులు, వేణుగోపాలాచారితో కలిసి రాజ్ కుమార్ రెడ్డి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవశర్మ, నారాయణపేట జిల్లా అధ్యక్షులు జ్ఞానేశ్వర్, వందలాదిమంది అర్చక సంఘ సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular