ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఘనంగా రాములోరి కల్యాణం

ఘనంగా రాములోరి కల్యాణం

📰 Generate e-Paper Clip

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట ఏప్రిల్06 (నేటి దర్శిని):
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి… ఫౌండేషన్ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులతో కలిసి పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా కోయిలకొండ మండలం కోత్లాబాద్ గ్రామంలో, అప్పిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ నిర్మలానంద గౌనోళ్ల రాంరెడ్డి రాజయోగి అచలగురు ఆశ్రమం,సీతారాముల దేవాలయంలో, అప్పిరెడ్డిపల్లి  దేవునిగుట్ట దేవాలయ ప్రాంగణంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో రాజ్ కుమార్ రెడ్డి పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, శివరాజ్, ఎం.సంతోష్, అశోక్, వెంకటరావు, నాగురావు, శ్రీనివాస్, ఆయా దేవాలయాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular