ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణసఖి వన్ స్టాఫ్ సెంటర్ సేవలు అభినందనీయం రాజ్ కుమార్ రెడ్డి

సఖి వన్ స్టాఫ్ సెంటర్ సేవలు అభినందనీయం రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

సఖి వన్ స్టాఫ్ సెంటర్ కు ఎల్.ఈ.డీ.టీవీని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

సఖి సెంటర్ ఆవరణలో మొక్కలను నాటిన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట ఫిబ్రవరి17 (నేటిదర్శిని):
ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తూ వారికి అభయహస్తాన్ని అందిస్తున్న సఖి వన్ స్టాఫ్ సెంటర్ సేవలు అభినందనీయమని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న సఖి వన్ స్టాఫ్ సెంటర్ కు వివిధ సమస్యల నిమిత్తం వచ్చే యువతులకు, మహిళలకు పలు రకాల అంశాల గురించి వివరిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వారు టీవీ అవసరం ఉందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డికి ఫౌండేషన్ సభ్యుల ద్వారా కలిసి వివరించారు. సిబ్బంది విజ్ఞప్తి మేరకు సఖి వన్ స్టాఫ్ సెంటర్ కు అవసరం ఉన్న ఎల్.ఈ.డీ టీవీని అందజేశారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రేమ విఫలమై, కుటుంబ సభ్యులతో గొడవలు పడి, భార్యాభర్తలు తగాదాలు పడి తమను ఆశ్రయించే మహిళలకు సఖి వన్ స్టాఫ్ సెంటర్ సిబ్బంది ధైర్యం చెబుతూ, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రక్షణ కల్పించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం సఖి వన్ స్టాఫ్ సెంటర్ ఆవరణలో రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, సెంటర్ సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాఫ్ సెంటర్ నారాయణపేట శాఖ అడ్మినిస్ట్రేటర్ క్రాంతిరేఖ, పారామెడికల్ లక్ష్మమ్మ, సిబ్బంది సుజాత, సరోజ, కేసరి, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, నర్సింహులు, శివరాజ్, చామకూర నగేష్, ఎం.సంతోష్, వెంకటరావు, నర్సింహులు, కృష్ణ, నగరి నాగురావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular