ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి చేయాలి రాజ్ కుమార్ రెడ్డి

ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి చేయాలి రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కానుకుర్తి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కణ

నారాయణపేట ఫిబ్రవరి19 (నేటిదర్శిని):
ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో యువత పయనించి అందరికీ ఆదర్శంగా నిలవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కణ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డికి నిర్వాహకులు ఖడ్గం అందజేశారు. అంతకముందు ఆయనను నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, నర్సింహులు, శివరాజ్, చామకూర నగేష్, ఎం.సంతోష్, వెంకటరావు, నర్సింహులు, కృష్ణ, నగరి నాగురావు, మేంగ్జీ నందుకుమార్, బసుదే అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular