ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణశరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం రాజ్ కుమార్ రెడ్డి

శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నారాయణపేటలో కరాటే పోటీలు

వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన విద్యార్థులు

నారాయణపేట ఫిబ్రవరి16 (నేటిదర్శిని):
శరీర దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. డ్రాగన్ షోటేకాన్ కరాటే డు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో ఆదివారం 24వ నేషనల్ కరాటే అండ్ కుంగ్ ఫు చాంపియన్‌షిప్-2025 పేరిట కరాటే పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్ కుమార్ రెడ్డి హాజరై పోటీల్లో ప్రతిభ కనబర్చిన కరాటే విద్యార్థులకు షీల్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ కరాటే శిక్షణ పొందాలని సూచించారు. అంతకుముందు కరాటే విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించి షీల్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో డ్రాగన్ షోటకాన్ కరాటే డు స్పోర్ట్స్ నిర్వాహకులు సలాం ఉమరుద్దీన్, సలీం, అమరేష్, కరాటే మాస్టర్ తిమ్మప్ప, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,  నర్సింహులు, శివరాజ్, చామకూర నగేష్, ఎం.సంతోష్, వెంకటరావు, నర్సింహులు, కృష్ణ, నగరి నాగురావు, వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular