ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం రాజ్ కుమార్ రెడ్డి

పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సుల అందజేత

నారాయణపేట డిసెంబర్14 (నేటిదర్శిని):
పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలో అథ్లెటిక్ క్రీడాకారులకు రూ.35 వేల విలువగల డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న విద్యార్థులను, పేదరికంతో క్రీడారంగంలో వెనుకబడి ఉన్న క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

విద్యార్థులతో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి

గతంలో తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది క్రీడాకారులకు, పేద విద్యార్థులకు పుస్తకాలు, స్పోర్ట్స్ డ్రెస్సులు, ల్యాప్‌టాపులను అందించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులను అందించిన రాజ్ కుమార్ రెడ్డిని అథ్లెటిక్ విభాగం నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ సురేష్, డైరెక్టర్ రమణ, శ్రీధర్, నరసింహులు, గణేష్, విద్యాసాగర్, భానుప్రకాష్, కోచ్ హారిక, ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, బాలాజీ, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి, ఉమేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, సంతోష్, అభిషేక్ రెడ్డి, రమణ, అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular