ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేత

పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేత

📰 Generate e-Paper Clip

పేద విద్యార్థులను ఆదుకునేందుకు కృషి : రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట డిసెంబర్09 (నేటిదర్శిని):

పేద విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత విద్యావంతులుగా తయారయ్యేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి వెంకటమ్మ-అశోక్ దంపతుల కుమార్తె తలారి సింధుజ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు గాను తలారి సింధుజకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్ ను బహూకరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చదువుకోవాలనే తపన ఉండి పేదరికంతో చదువుకు దూరం అవుతున్న విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ ఫౌండేషన్ చేయూతనిస్తుందని తెలిపారు. అదేవిధంగా చదువుకు దూరమైన బడీడు పిల్లలను బడుల్లో చేర్పించేందుకు కంకణ బద్ధులమై ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువులకు ఎలాంటి అవసరం ఉన్నా తమ సంస్థ సహాయ, సహకారాలు అందిస్తుందని వివరించారు.

భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం: సింధుజ

తాను పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు ల్యాప్‌టాప్ అవసరం ఉంటుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డిని అడిగిన వెంటనే ల్యాప్‌టాప్ ను అందజేశారని విద్యార్థిని సింధుజ  తెలిపారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని విద్యార్థిని సింధుజ తండ్రి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, గోపాల్, కృష్ణ, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular