హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి

IMG-20250204-WA0542.jpg

దేవాలయాల శిఖరాలకు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన రాజ్ కుమార్ రెడ్డి

రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన ఆలయ నిర్వాహకులు

నారాయణపేట ఫిబ్రవరి04 (నేటిదర్శిని):
నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపల్ పరిధిలోని బహార్ పేటలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు ఘనస్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హనుమాన్ దేవాలయం, చౌడేశ్వరి మాత ఆలయాల్లో రాజ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన హనుమాన్, చౌడేశ్వరి మాత దేవాలయాల్లో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని తెలిపారు. దేవాలయాల్లో రెండు శిఖరాల నిర్మాణానికి రూ.10లక్షలు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చులను భీష్మరాజ్ ఫౌండేషన్ భరిస్తుందని భరోసా కల్పించారు. దేవాలయాల అభివృద్ధికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామినిచ్చారు. అనంతరం భక్తులకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేయగా, రాజ్ కుమార్ రెడ్డి భక్తులకు అన్నదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నర్సమ్మ రాము, వరలక్ష్మి కార్తీక్, వెంకటప్ప, దేవాలయ నిర్వాహకులు శంభు ప్రభాకర్, ఆకుల బాలప్ప, నర్సింహులు, దత్తు, గొల్ల గోపాల్, కృష్ణ, భీమప్ప, మాణిక్యప్ప, నర్సింహ, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, హనుమంతు, శ్రీనివాస్, నర్సింహులు, శివరాజ్, చామకూర నగేష్, ఎం.సంతోష్, మారుతి యువ ఫ్రెండ్స్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

1 thought on “హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి

Comments are closed.