వైద్య ఖర్చుల కోసం 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

IMG-20251028-WA0053.jpg

👉 అవసరంలో ఉన్నవారికి అండగా భీష్మరాజ్ ఫౌండేషన్

👉 సేవే మాకు ధర్మం – చైర్మన్ డా. కె. రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట, అక్టోబర్ 28(నేటి దర్శిని): సామాజిక సేవకు అంకితమైన భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా దృక్పథాన్ని మరొకసారి చాటుకుంది. నారాయణపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న స్టిల్ రాజు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ఆర్థిక సాయం అందించింది. ఫౌండేషన్ చైర్మన్ డా. కె. రాజ్ కుమార్ రెడ్డి స్వయంగా స్టిల్ రాజు నివాసానికి వెళ్లి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆరోగ్యం కోల్పోయినప్పుడు మనుషులు ఆర్థికంగా కష్టాల్లో పడతారు. అలాంటి కుటుంబాలకు సహాయం చేయడం మన బాధ్యత. భీష్మరాజ్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది,” అని అన్నారు. అలాగే సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో సహాయం అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. స్థానికులు, ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని డా. రాజ్ కుమార్ రెడ్డి సామాజిక సేవా తపనను అభినందించారు. స్టిల్ రాజు కుటుంబసభ్యులు ఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, డా. రాజ్ కుమార్ రెడ్డి మరియు భీష్మరాజ్ ఫౌండేషన్‌పై ప్రశంసలు కురిపించారు.