ePaper
Monday, July 20, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeక్రీడలుCricketer: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. బంతి తగిలి యువ క్రికెటర్ దుర్మరణం

Cricketer: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. బంతి తగిలి యువ క్రికెటర్ దుర్మరణం

📰 Generate e-Paper Clip

నేటి దర్శిని (వెబ్ న్యూస్): ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ఈ రోజు కన్నుమూశాడు. మంగళవారం రాత్రి ఫెర్న్‌ట్రీ గల్లీలోని వాలీ ట్యూ రిజర్వ్ మైదానంలో ఆటోమేటిక్ బౌలింగ్ మెషిన్‌తో ప్రాక్టీస్ చేస్తుండగా, బంతి నేరుగా అతని మెడ వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో బెన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.తక్షణమే సహచరులు అతడిని అత్యవసర చికిత్స కోసం క్లేటన్‌లోని మోనాష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు చిన్న మెదడుకు గాయం జరిగినట్లు గుర్తించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం అతడు మృతిచెందాడు. ఈ విషయాన్ని ఫెర్న్‌ట్రీ క్రికెట్ క్లబ్ (Ferntree Cricket Club) అధికారికంగా ధృవీకరించింది. క్లబ్ సభ్యులు బెన్ ఆస్టిన్‌ను ప్రతిభావంతమైన క్రికెటర్‌గానే కాక, గొప్ప నాయకుడిగానూ పేర్కొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్(Mike Baird) తన సంతాపం వ్యక్తం చేస్తూ, “బెన్ మృతి వార్త హృదయాన్ని కలచివేసింది” అని అన్నారు. అలాగే సెయింట్ డేవిడ్స్, కిల్సిత్, మిచామ్ వంటి స్థానిక క్లబ్‌లు కూడా తీవ్ర సంతాపం తెలియజేశాయి.గమనించదగ్గ విషయం ఏమిటంటే, సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ కూడా మ్యాచ్ సందర్భంగా తలకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

RELATED ARTICLES

Most Popular