శ్రీ రుషి చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6వ వార్షికోత్సవ వేడుకలు
- హాజరైన రాజ్ కుమార్ రెడ్డి తదితరులు
హైదరాబాద్, అక్టోబర్05 (నేటి దర్శిని): శ్రీ రుషి చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ పీర్జాదిగూడలోని చిట్ ఫండ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రుషి చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దినదినాభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం చిట్ ఫండ్ లో పని చేస్తున్న ఏజెంట్లకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్ ఫండ్ డైరెక్టర్ చరణ్, మాజీ సర్పంచ్ వీరారెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ శివరాజు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


