ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఅశోక్‌నగర్ లో అమ్మవారి విగ్రహ ఏర్పాటు, అన్నదానానికి రూ.30వేల విరాళం

అశోక్‌నగర్ లో అమ్మవారి విగ్రహ ఏర్పాటు, అన్నదానానికి రూ.30వేల విరాళం

📰 Generate e-Paper Clip

  • రాజ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అశోక్‌నగర్ వాసులు
  • సల్లంగ ఉండాలని మహిళల దీవెనలు

నారాయణపేట, సెప్టెంబర్29 (నేటి దర్శిని): శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట పట్టణంలోని అశోక్‌నగర్ లో నెలకొల్పిన అమ్మవారి మండపంలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ అశోక్‌నగర్ లో మహిళలు గత కొన్నేళ్లుగా శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఇప్పించాలని, మండపం వద్ద జరిగే అన్నదానానికి సహకరించాలని కోరుతూ పలువురు మహిళలు రాజ్ కుమార్ రెడ్డిని కలిసి కోరడం జరిగిందని, కోరిన వెంటనే అమ్మవారి విగ్రహంతో పాటు అన్నదానానికి రూ.30వేలను అందజేశారని గుర్తు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ఇప్పించడంతో పాటు అన్నదానానికి సహకరించిన రాజ్ కుమార్ రెడ్డికి, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే కాదనకుండా ముందుకు వచ్చి సహాయం చేసిన రాజ్ కుమార్ రెడ్డి సల్లంగ ఉండాలని మహిళలు దీవెనలు ఇచ్చారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అమ్మవారి పూజా కార్యక్రమాలకు హాజరయ్యామని తెలిపారు. అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అంతకుముందు మండప నిర్వాహకులు ఫౌండేషన్ సభ్యులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన రెడ్డి, హన్మంతు ముదిరాజ్, ఎం.సంతోష్, శివరాజ్, వై.సంతోష్, నర్సింహనాయుడు, అశోక్ బసుదే, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular