మిడ్జిల్ సింగల్ విండో చైర్మన్ కూచూరు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు
మిడ్జిల్ ,జూన్ 23(నేటి దర్శిని): తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. మిడ్జిల్ సింగల్ విండో చైర్మన్ కూచూరు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొని పూజ క్రతువులను నిర్వహించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, స్వామి వారిని వేడుకున్నట్లు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి తెలిపారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో కూచూరు భీమ్ రెడ్డి, కూచూరు జితేందర్ రెడ్డి, కూచూరు విజయకుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





