ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణశాంతి భద్రతలు కాపాడుతూ  ఎల్లప్పుడూ పొలిస్ మీకోసం

శాంతి భద్రతలు కాపాడుతూ  ఎల్లప్పుడూ పొలిస్ మీకోసం

📰 Generate e-Paper Clip

👉🏻  పోలీసు అమరవీరుల స్ఫూర్తితోనే పోలీస్‌ సేవలు…

👉🏻  సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

👉🏻  నేరాలు , మాదక ద్రవ్యాల వాడకం పై విద్యార్థులకు అవగాహన…

మందమర్రి, అక్టోబర్ 23 ( నేటి దర్శిని) : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్‌ ఫ్లాగ్‌ డే) వారోత్సవాలను పురస్కరించుకొని, మందమర్రి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో గురువారం  ‘ఓపెన్‌హౌస్‌’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మందమర్రి ఎస్సై  రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంపై  పట్టణంలోని చైతన్య నగర్ ప్రభుత్వ పాఠశాల  విద్యార్థినీ , విద్యార్థులు  హాజరై పోలీసుల విధులను కోసం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్‌ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ,  చట్టాన్ని గౌరవించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో కీలకంగా మారిన సైబర్ నేరాలు మహిళా రక్షణ మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ నేరాల తీరు, మోసగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఫిర్యాదు చేసేందుకు ఉన్న 1930 నంబరర్ గురించి విద్యార్ధులకు వివరించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు, భయంకరమైన పరిణామాల పై హెచ్చరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, షీ టీమ్ పనితీరు గురించి వివరించారు. పోలీసు విధులు, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ వంటి విభాగాల బాధ్యతలను క్లుప్తంగా తెలిపారు. ఓపెన్‌హౌస్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా పరిచయం చేశారు. పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది విధులు, బాధితులు ఫిర్యాదు ఇచ్చే విధానం, దానిపై విచారణ జరిగే పద్ధతిని వివరించారు.
పోలీసులు వినియోగించే సాంకేతిక పరికరాలైన సీసీ కెమెరాల ప్రాధాన్యం, ఫింగర్ ప్రింట్ డివైస్‌ , ట్రాఫిక్ ఎక్విప్‌మెంట్, ముఖ్యంగా డయల్ 100 విధానం గురించి క్లుప్తంగా వివరించి, కాల్‌ చేసిన వెంటనే పోలీసులు ఎలా స్పందిస్తారో తెలిపారు. అనంతరం, ఆయుధాల వినియోగాన్ని ప్రదర్శించి, విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మాజీద్‌ ఖాన్‌, మిలింద్ కుమార్‌, ఇతర పోలీస్‌ సిబ్బంది, పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular