ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణనారాయణపేట రూరల్ పీఎస్ కు ఎల్.ఈ.డీ టీవీని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

నారాయణపేట రూరల్ పీఎస్ కు ఎల్.ఈ.డీ టీవీని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

📰 Generate e-Paper Clip

  • గతంలో ఒకటి, ఇప్పుడు మరొక టీవీ అందజేత

నారాయణపేట,సెప్టెంబర్18 (నేటి దర్శిని): నారాయణపేట రూరల్ పోలీసు స్టేషనులో సీసీ కెమెరాల పరిశీలన నిమిత్తం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు గురువారం పోలీసు స్టేషనులో సబ్ ఇన్ స్పెక్టర్ రాములుకు ఎల్.ఈ.డీ టీవీని అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న మాట్లాడుతూ నారాయణపేట రూరల్ పీఎస్ లో సీసీ కెమెరాల పరిశీలన నిమిత్తం టీవీ అవసరం ఉందని ఎస్ఐ రాములు, సిబ్బంది గతంలో ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా, అందుకు స్పందించిన రాజ్ కుమార్ రెడ్డి గతంలో ఒక ఎల్.ఈ.డీ టీవీ, గురువారం ఒక ఎల్.ఈ.డీ టీవీని అందజేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం చేసేందుకు తమ ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటుందని పేర్కొన్నారు. ఎల్.ఈ.డీ టీవీని అందజేసినందుకు చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డికి, సభ్యులకు పోలీసు అధికారులు ధన్యవాదాలు తెలిపారు. టీవీ అందజేసిన వారిలో ఫౌండేషన్ సభ్యులు హన్మంతు ముదిరాజ్, కృష్ణ యాదవ్, ఎం.సంతోష్, అశోక్, వై.సంతోష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular