ePaper
Monday, September 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణదేవాలయంలో గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు: రాజ్ కుమార్ రెడ్డి

దేవాలయంలో గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు: రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మరికల్ సరస్వతీదేవి దేవాలయంలో గ్రిల్స్ ఏర్పాటుకు లక్ష రూపాయల చెక్కు అందజేత

రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు

నారాయణపేట,సెప్టెంబర్03(నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీదేవి దేవాలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఒక లక్ష రూపాయల చెక్కును బుధవారం దేవాలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాట్లాడుతూసరస్వతిదేవి దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నా, చుట్టూ గ్రిల్స్ లేకపోవడం వల్ల తరచూ దేవాలయంలోకి దుండగులు చొరబడి దొంతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని రాజ్ కుమార్ రెడ్డికి వివరించిన వెంటనే గ్రిల్స్ ఏర్పాటుకు లక్ష రూపాయలను అందజేయడం జరిగిందని వివరించారు. దీంతో పాటు దేవాలయంలో రాజ్ కుమార్ రెడ్డి సీసీ కెమెరాను ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. అంతకుముందు దేవాలయ నిర్వాహకులు శాలువతో రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.

గణపయ్యకు పూజలు చేసిన రాజ్ కుమార్ రెడ్డి

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరికల్ మండల కేంద్రంలోని మరికల్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని మండపాన్ని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే రాజ్ కుమార్ రెడ్డి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు రాజేష్, వెంకటరాంరెడ్డి, రామస్వామి, జైపాల్ రెడ్డి, కృష్ణయ్య, హరీష్, సురేష్, మల్లేష్, రాములు, రఘు, శ్రీను, సత్యరెడ్డి, వినాయక మండప నిర్వాహకులు, ఫౌండేషన్ సభ్యులు రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular