ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణపళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నీటి బోరు ఏర్పాటుకు భూమి పూజ చేసిన రాజ్ కుమార్ రెడ్డి

పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నీటి బోరు ఏర్పాటుకు భూమి పూజ చేసిన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రాజ్ కుమార్ రెడ్డిని సన్మానించిన కాలనీవాసులు

నారాయణపేట జూలై14 (నేటి దర్శిని):
పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బోరు నిర్మాణ పనులకు సోమవారం రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, కాలనీ పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాలనీలో నీటి సమస్య ఉందని కాలనీవాసులు తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాలనీలో నీటి ఎద్దడి నివారణకు దశలవారీగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని కాలనీవాసులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు శ్రీకాంత్, గడ్డం సిద్దు, కనికి శ్యామ్, ఎల్లప్ప, క్యాతనపల్లి శివ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, పుర్ర బాలప్ప, లింగప్ప, ఫరిద్, జమీర్, చాంద్, ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు బాలాజీ, గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, వెంకటరావు, హన్మంతు ముదిరాజ్, వై.సంతోష్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, నందుకుమార్, మన్నె గోపాల్, నర్సింహ, కృష్ణ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular