ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణచౌడేశ్వరిదేవి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాజ్ కుమార్ రెడ్డి

చౌడేశ్వరిదేవి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

భక్తులకు అన్నదానం చేసిన రాజ్ కుమార్ రెడ్డి, దేవాలయ నిర్వాహకులు

నారాయణపేట జూన్11 (నేటి దర్శిని):
ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని నారాయణపేట పట్టణం బాపునగర్ లోని శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయంలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని రాజ్ కుమార్ రెడ్డి ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని కోరారు. దేవాలయ ప్రాంగణంలో ప్రతి పౌర్ణమి రోజున భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు మేకల రామకృష్ణ, కార్యదర్శి నారాయణ, కోశాధికారి వెంకటస్వామి, సభ్యులు గుంపు బాలరాజు, దూస నర్సింహులు, మేకల మురళి, వెంకటేష్, రమేష్, సంగ కృష్ణ, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, హన్మంతు ముదిరాజ్, శివరాజ్, అనిల్, నరసింహనాయుడు, రుద్రారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ యాదవ్, ఎం.సంతోష్, రాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular