ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణఎల్లారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ఏర్పాటుకు రూ.65వేలను అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి

ఎల్లారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ఏర్పాటుకు రూ.65వేలను అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

2న ఎల్లారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

కోయిలకొండ మే30 (నేటి దర్శిని):
నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ఏర్పాటుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి రూ.65వేల చెక్కును దేవాలయ నిర్వాహకులకు శుక్రవారం అందజేశారు. జూన్ 2వ తేదీ సోమవారం దేవాలయంలో పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్ కుమార్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించడం జరిగిందని నిర్వాహకులు హన్మిరెడ్డి తెలిపారు. అడిగిన వెంటనే కాదనకుండా పోచమ్మ తల్లి విగ్రహానికి అయ్యే మొత్తాన్ని రాజ్ కుమార్ రెడ్డి అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular