ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణవీర్ సావర్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

వీర్ సావర్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పేటలో వీర్ సావర్కర్ కు నివాళులు అర్పించిన రాజ్ కుమార్ రెడ్డి, కుర్మన్న

నారాయణపేట మే28 (నేటి దర్శిని):
దేశంలో ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయవాదాన్ని చాటిచెప్పిన మహా నాయకుడు వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్ అని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. వీర్ సావర్కర్ 142వ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని వీర్ సావర్కర్ విగ్రహానికి ఆర్ఎస్ఎస్ ప్రాంత ధర్మ జాగరణ్ విభాగ్ ప్రతినిధి కుర్మన్న, ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర్ సావర్కర్ దేశానికి చేసిన సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల బాటలో ప్రతిఒక్కరూ పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, హన్మంతు ముదిరాజ్, శివరాజ్, నర్సింహనాయుడు, వై.సంతోష్, నాగురావు, నందుకుమార్, వెంకటరావు, అశోక్, చామకూర నగేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular