ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణనల్గొండ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై పాశం గోపాల్ రెడ్డి ఆగ్రహం

నల్గొండ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై పాశం గోపాల్ రెడ్డి ఆగ్రహం

📰 Generate e-Paper Clip

గుర్రంపోడు జనవరి20 (నేటిదర్శిని):
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు నల్గొండలో జరగనున్న రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రతిపక్షం చేస్తున్న ధర్నాకు అనుమతి నిరాకరణ  ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని పాశం గోపాల్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శలు చేశారు. కృష్ణా, గోదావరిలో నీటిసమృద్ధి ఉన్నా, రైతులకు అవసరమైన నీటిని అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని తెలిపారు. “బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టే కార్యక్రమాలు ప్రభుత్వానికి భయాన్ని కలిగిస్తున్నాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి నిదర్శనం,” అని పాశం గోపాల్ రెడ్డి ఆరోపించారు. “ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుంది. ఇది మా హక్కు. రైతుల పక్షాన నిలబడటం ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ హక్కు,” అని గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ దీక్షలను నిర్వహిస్తుందని, ప్రజలు కూడా శాంతియుతంగా వీటిలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు మహా ధర్నాకు అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశార.

RELATED ARTICLES

Most Popular