ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణక్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు వస్త్రాల పంపిణీ

దామరగిద్ద జనవరి18 (నేటిదర్శిని):
క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని ప్రార్థనా మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.  అనంతరం భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది క్రైస్తవ సోదర, సోదరీమణులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిని  పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డి దంపతులను నిర్వాహకులు శాలువ, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, సేవకులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, హన్మంతు, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, వెంకటప్ప, నర్సింహులు, సంతోష్, రుద్రారెడ్డి, వెంకటరావు, ఎం.సంతోష్, అశోక్, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular