ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణరూపా రెడ్డి హత్య కేసులో కీలక మలుపు..!?..?

రూపా రెడ్డి హత్య కేసులో కీలక మలుపు..!?..?

📰 Generate e-Paper Clip

ఇద్దరు టెన్త్ విద్యార్థులే నిందితులా..?

ఇబ్రహీంపట్నం వద్ద పోలీసుల అదుపులోకి..!

రూ.4 లక్షల నగదు చోరీ..!

సీసీ కెమెరాలతో చిక్కిన కీలక ఆధారాలు

సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం..!

 

నల్గొండ: జిల్లాలో గత వారం సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపా రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితులు ఇద్దరు పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. సమీపంలోని ఓ తండాకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.హత్య అనంతరం రూపా రెడ్డి ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదును కూడా నిందితులు చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఘటన అనంతరం ఆధారాలు లభించకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది.కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించిన అధికారులు గత వారం రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు తొలుత నిందితుడు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి అయి ఉండవచ్చని అనుమానించారు.అనంతరం పాఠశాల విద్యార్థుల వివరాలను సేకరించి, అనుమానితుల కదలికలు, సీసీ కెమెరా దృశ్యాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. చివరకు అనుమానం ఇద్దరు విద్యార్థులపై కేంద్రీకృతం కావడంతో వారిని విచారించగా కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.కేసు దర్యాప్తులో భాగంగా రూపా రెడ్డి భర్తను కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులు, చోరీ చేసిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular