నిధులు ఉన్నా.. అభివృద్ధి సున్నా…
👉 మూత పడుతున్న వికలాంగుల చేయూత ఉత్పత్తి శిక్షణ కేంద్రాలు...
👉 ప్రభుత్వం వెంటనే స్పందించాలి: వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వంశ రాజ్ రామ చంద్ర…
హైదరాబాద్/నేటి దర్శిని : వికలాంగులకు చేయూతనిచ్చేందుకు ఉద్దేశించబడిన ఉత్పత్తి శిక్షణా కేంద్రాలు (టిసిపిసి) కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఉన్న ఏకైక టిసిపిసి కూడా పనులు లేక ఉత్సవ విగ్రహంగా మారింది. టిసిపిసిల్లో ట్రైసైకిల్స్, క్రూచెస్ (ఊతకర్రలు) తయారు చేసి వికలాంగులకు అందిం చడం జరుగుతోంది. ప్రారంభంలో తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ లలో టిసిపిసి లు చేసేవి. ఉమ్మడి రాష్ట్రంలోనే టిసిపిసి ని మూసి వేయగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిజామాబాద్ టిసిపిసి ను మూసివేశారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి టిసిపిసిలు పనిచేస్తుండగా రంగారెడ్డి టిసిపిసిని హైదరాబాద్ టిసిపిసిలో కలిపేశారు. దీంతో ప్రస్తుతం మలక్ పేట లో మాత్రమే హైదరాబాద్ టిసిపిసి పనిచేస్తోంది. అయితే ఈ కేంద్రం లోనూ ఉత్పత్తి ఆగిపోయిందని ఉద్యో గులు వాపోతున్నారు. వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ కేంద్రంలో తమకు పనిలే కుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నా టిసిపిసిల పట్ల యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేటతెల్లం అవుతోంది. ప్రభుత్వం జీత భత్యాలకు కాకుండా ఎయిడ్స్ అండ్ అప్లయెన్సెస్ కోసం ప్రభుత్వం వికలాంగుల కార్పొరేషన్ కు గత రెండేళ్లుగా రూ.50 కోట్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. అయితే కార్పొరేషన్ యాజమాన్యం టిసిపిసికి పని కల్పించకుండా, ముడిసరుకు అందించకుండా ప్రైవేటు సంస్థలకు మేలు జరిగేలా ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శలు వస్తున్నా యి. ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్ర వేటు సంస్థల నుండి కొను గోలు చేసి వికలాంగులకు పరికరాలను అందిస్తున్నారని వైఖరి కారణంగా లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
